
పాకిస్థాన్ వైమానిక దళం శనివారం తమ దేశీయ నిర్మిత తైమూర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి. ఈ తైమూర్ క్షిఫణి ఆయుధ వ్యవస్థతతో 600 కిలో మీటర్ల దూరంలోని లక్షాన్ని ఛేదించేందుకు వీలుంది. దీనిని నమూనాత్మకంగా పాక్ వైమానిక దళం పరీక్షించుకుంది. ఇందులో అంతా సజావుగా ప్రక్రియ ముగిసిందని, విజయవంతం అయిందని అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్ష నిర్వహణ విజయవంతం కావడంతో దేశ గగనతల , రక్షణ సమర్థత విషయంలో గణనీయ మైలురాయి అవుతుందని పాకిస్థాన్ సైనిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అత్యంత అధునాతన ఛోదక నిర్మాణ వ్యవస్థతో ఈ క్షిపణి బలోపేతంగా ఉందని వివరించారు. తక్కువ ఎత్తులో కూడా ఇవి దూసుకువెళ్లగలవు . ప్రతికూల వాతావరణ పరిస్థితులు, శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థలను ఎదుర్కొని నిలవగలవని సైనిక వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.