Reading Time: < 1 minute

న్యూఢిల్లీ ః కేసుల దర్యాప్తుపై కోర్టులు గడువు విధించడం తప్పనిసరి నిబంధన కాదు. అసాధారణ చర్యనే అని సుప్రీంకోర్టు తెలిపింది. దర్యాప్తు సంస్థలకు గడువుల ఖరారు విషయంలో న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఎన్‌కె సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ విషయం స్పష్టం చేసింది. దర్యాప్తు గడువు విధించడం అనేది కోర్టులు వాటి తీవ్రతను బట్టి ఒక్కోసారి చురుగ్గా సాగించేందుకు జారీ చేయడం జరుగుతుంది. అసాధారణ జాప్యం అన్యాయానికి దారితీస్తుంది కాబట్టి దీనిని నివారణ చర్యగా మందుగా భావించరాదని కూడా ధర్మాసనం తెలిపింది. కేవలం దర్యాప్తు వేగవంతానికి తీసుకునే చర్యగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో తప్పుడు పత్రాలతో ఆయుధ లైసెన్సులు పొందిన కేసులో నిందితులకు ఉపశమనం విషయంపై పోలీసు దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు గడువు విధించింది. ఈ ఆదేశాల అంశం దర్యాప్తు విషయంలో ప్రమేయం లేదా, ఒత్తిడి పెంచడం కిందికి వస్తుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో విచారణకు వచ్చింది. దీనిపై రూలింగ్ వెలువరించారు.

కొన్ని కేసుల విచారణలో పురోగతి లేదా జాప్యం గురించి అడపాదడపా కోర్టులు జోక్యం చేసుకోవడం అనేది రాజ్యాంగ పద్ధతి అవుతుంది. కేసుల దర్యాప్తు లో జాప్యం అనేదే కోర్టుల ధిక్కారం పరిధికి వస్తుంది కాబట్టి స్పందనకు వీలుంటుంది. అయితే ఇది అన్ని కేసులకు వర్తించకపోవచ్చు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలకు సంబంధించి వాటి స్వరూపాన్ని గుర్తించి కొట్టివేయడం జరుగుతుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.