Reading Time: < 1 minute

రాజస్థాన్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ వార్తా పత్రిక చదవడం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ సెకండరీ పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కనీసం రెండు వార్తాపత్రికలు తీసుకోవాలని తెలియజేసింది. అందులో ఒక హిందీ, ఒక ఇంగ్లీష్ పేపర్ల తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలని తెలియజేసింది. విద్యార్థుల్లో పఠనం అలవాట్లను ప్రోత్సహించడానికి, పదజాలాన్ని మెరుగుపరచడానికి , సాధారణ అంశాలపై అవగాహనను పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాజస్థాన్ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులు ఉదయం అసెంబ్లీలో కనీసం 10నిమిషాలు వార్తా పత్రికలు చదవాలి. ఈ అలవాటు విద్యార్థులకు సమాజంలో జరిగే ప్రస్తుత వ్యవహారాలను పరిచయంచేయడం,అలానే వార్తలను అర్థం చేసుకునే, వాటిని విశ్లేషించే సామర్థాన్ని పెంపొందించడమే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశం ప్రకారం ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలు,

ఇంగ్లీష్ మీడియం పాఠశాలలలు కనీసం రెండు వార్తాపత్రికలను, అందులోనూ ఒక హిందీ, ఒక ఇంగ్లీష్ పేపర్‌ను తీసుకోవాలని ఆదేశించింది. అలానే ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలు కనీసం రెండు హిందీ వార్తా పత్రికలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది. న్యూస్‌పేపర్ల కొనుగోలు ఖర్చును రాజస్థాన్ స్కూల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ భరిస్తుంది. పాఠశాల అసెంబ్లీ సమయంలో ఆంగ్లంలో ఒక జాతీయ స్థాయి వార్తాపత్రిక, హిందీలో ఒకదాన్ని బిగ్గరగా చదవాలి. విద్యార్థులను తరగతుల వారీగా విభజించి, సంపాదకీయాలు, ప్రధాన జాతీయ, అంతర్జాతీయ క్రీడా వార్తలను చదవడానికి , చర్చించడానికి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని విద్యాశాఖ ఉత్తర్వులో పేర్కొంది. ఈ కార్యక్రమం విద్యార్థుల సాధారణ జ్ఞానాన్ని, సమాజంపై అవగాహనను మెరుగుపరచడమే కాకుండా, వారిని పోటీ పరీక్షలకు మరింత మెరుగ్గా సిద్ధం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. వారం క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.