Reading Time: < 1 minute

టి-20 ప్రపంచకప్‌కి ముందు టీం ఇండియా న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే, టి-20ల సిరీస్‌లో తలపడనుంది. ఇప్పటికే టి-20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన జట్టునే ఈ టి-20 సిరీస్‌లోనూ కొనసాగిస్తామని ప్రకటించగా.. వన్డే సిరీస్‌ను శనివారం బిసిసిఐ ప్రకటించింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే శ్రేయస్ మ్యాచులు ఆడుతాడు.

అయితే ఒక మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి హార్థిక్ పాండ్యకు సిఒఇ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో, టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని వన్డేలకు అతడికి విశ్రాంతి కల్పించారు. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ జట్టులో కొనసాగించారు. అయ్యర్ రీ ఎంట్రీతో రుతురాజ్ గైక్వాడ్‌పై వేటు పడింది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో సత్తా చాటినప్పటికీ.. అతడివైపు సెలక్టర్లు మొగ్గు చూపించలేదు. బుమ్రాకి కూడా విశ్రాంతి ఇవ్వడంతో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. పాండ్యా స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.

కివీస్‌తో తలపడే వన్డే జట్టు

శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్(కీపర్), శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్, ఫిట్‌నెస్‌కి లోబడి), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వీ జైస్వాల్.