
తమిళ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం ‘జన నాయగణ్’. తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన విడుదల కానుంది. అయితే సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన అప్‌డేట్స్ చూసి ఇది తెలుగులో అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. అయితే దర్శకుడు హెచ్.వినోద్ మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే ఇది ‘భగవంత్ కేసరి’ రీమేక్ అని అర్థమవుతోంది. తెలుగులో శ్రీలీల చేసిన పాత్రలో మమిత బైజు, కాజల్ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలిసిపోయింది. బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక సినిమా భగవంత్ కేసరి రీమేక్ అయినప్పటికీ.. దర్శకుడు వినోద్ కొంత భాగం డిఫరెంట్‌గా తెరకెక్కించారు. తమిళనాడులో విజయ్ రాజకీయాలకు తోడ్పేలా కొన్ని సన్నివేశాలు ట్రైలర్‌లో చూపించారు. మరి విజయ్ చివరి చిత్రం ‘జన నాయకుడు’ ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి.