Reading Time: < 1 minute

ఈగల్, నార్సింగి పోలీసులు నానక్‌రామ్‌గూడలో నిర్వహించిన దాడుల్లో గంజాయి తీసుకున్న ఎపి రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు బిజేపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు, మరో వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. ఇంట్లోనే పోలీసులు టెస్టులు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ రావడంతో డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం…నానక్‌రాంగూడలోని ఏక్తా విల్లాస్‌లోని విల్లా నంబర్ 16లో ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఉంటున్నాడు. సుధీర్‌రెడ్డి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది, వెంటనే అక్కడికి వెళ్లిన ఈగల్, నార్సింగి పోలీసులు కలిసి సుధీర్ రెడ్డి ఇంట్లో దాడులు చేశారు. సుధీర్ రెడ్డి, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని పరీక్ష నిర్వహించగా ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. వెంటనే సుధీర్‌రెడ్డి, మరో వ్యక్తిని అరెస్టు చేసి ఢీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. గతంలో కూడా సుధీర్‌రెడ్డి రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈగల్ పోలీసులు నిఘా పెట్టారు, సమాచారం రావడంతో దాడి చేసిపట్టుకున్నారు. సుధీర్‌రెడ్డికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సరఫరా చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరో వ్యక్తికి నెగిటివ్ రావడంతో వదిలేశారు. సోదాల సమయంలో డ్రగ్స్, గంజాయి దొరకలేదని ఈగల్ టీమ్ అధికారులు తెలిపారు. డిప్రెషన్ వల్లే సుధీర్ రెడ్డి డ్రగ్స్‌కు బానిసగా మారినట్లు పోలీసులు తెలిపారు. సుధీర్‌రెడ్డి ఈ కేసులో పట్టుబడిన తర్వాత కుటుంబ సభ్యులకు ఈగల్ టీమ్ అధికారులు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సుధీర్‌రెడ్డిపై గతంలో ఎలాంటి కేసులు లేవని పోలీసులు తెలిపారు.