Reading Time: < 1 minute

వెండితెరపై నవ్వులు పూయించే కమెడియన్లు ఎందరో హీరోలుగా ఎదిగారు. వారిలో కొందరు సక్సెస్ కాగా, కొంతమంది మాత్రం బోల్తా పడ్డారు. ప్రస్తుత స్టార్ కమెడీయన్లలో సత్య ఒకడు. ఎంత చిన్న పాత్రైనా.. తనదైన శైలీలో నవ్వులు పూయించడంలో సత్య ధిట్టా. అయితే ఇఫ్పుడు సత్య కూడా హీరోగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ‘మత్తువదలరా’ ఫేమ్ దర్శకుడు రితేష్ రాణా నాలుగో చిత్రంతో సత్య హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రానికి ‘జెట్లీ’ నామకరణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ని విడుదల చేశారు.

ఓ విమానం గాల్లో ఉండగా.. అనుకోని పరిస్థితి ఏర్పడితే ఏం జరుగుతుంది. హీరో ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా కాన్సెప్ట్‌గా గ్లింప్స్ చూస్తే.. అర్థమవుతోంది. ‘విశ్వధాభిరామా.. ఇంతకీ నేనెవడినిరా మామ’ అంటూ సత్య చెప్పే డైలాగ్ గ్లింప్స్‌కి హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.