
హైదరాబాద్: ఒకప్పుడు తన పాప్ సాంగ్స్‌తో కుర్రకారును షేక్ చేశారు సింగర్ స్మిత. చాలా కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. తన ఫేమస్ రీమేక్ సాంగ్ ‘మసక మసక’ సాంగ్‌ను మరోసారి రీమేక్ చేసి దానికి నటుడు, సింగర్ నోయెల్‌తోక లిసి ర్యాప్ జత చేసి రిలీజ్ చేశారు. అయితే మరికొన్ని రోజుల్లో సంక్రాంతి వస్తున్న సందర్భంగా మరోపాటని విడుదల చేశారు. ‘భీమవరం బీట్’ అంటూ సాగే ఈ పాటని కూడా స్మిత, నోయెల్ కలిసి పాడారు. ఈ పాటలో ఎపి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కనిపించారు. రెండు స్టెప్పులూ వేశారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.