
ఆరేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బులందర్ షహార్ లో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. చిన్నారి ఇంటి దాబా పై ఆడుకునేందుకు వెళ్లగా వారి ఇంటిపై అద్దెకుండే రాజ్, కశ్యప్ చిన్నారిపై అత్యచారం చేసి ఆపై దాబాపై నుంచి తోసేశారు. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. అది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందుతుల కోసం వెతకగా నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఉన్నట్లు తెలిసింది. అక్కడకు వెళ్లిన పోలీసులపై నిందుతులు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.ఆ తర్వాత నిందుతులను అరెస్ట్ చేసి చికిత్సం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.