
హైదరాబాద్: డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్.. ఇప్పటివరకూ ఎన్నో డ్రగ్స్ రాకెట్లను చేధించింది. ఎంతో మందిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసింది. తాజాగా డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే కుమారుడిని అరెస్ట్ చేసింది. ఈగల్ టీం. డగ్స్ తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ నార్సింగిలో జరిగిన తనిఖీల్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు దొరికిపోయాడు. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో సుధీర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించారు. అతడితో పాటు మరొకరు కూడా పోలీసులకు చిక్కాడు. గతంలో రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ దొరికిపోవడం గమనార్హం.