Reading Time: < 1 minute

రాజ్‌కోట్: ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో టీం ఇండియా స్టార్లు కూడా పాల్గొంటున్నారు. బిసిసిఐ మార్గదర్శకాల మేరకు వీరు ఈ మ్యాచ్‌లు ఆడుతున్నారు. తాజాగా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా బరోడా తరఫున బరిలోకి దిగాడు. విదర్భతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన శతకంతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ జట్టు బరోడాను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన బరోడా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో హార్థిక్ పాండ్యా తన సోదరుడు కృనాల్‌తో కలిసి స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, కృనాల్(23) కూడా నిరాశపరిచాడు.

ఈ నేపథ్యంలో హార్థిక్ పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. 68 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతకు ముందు ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సులు, ఒక ఫోర్ బాది.. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టా ఛాన్స్‌ని తృటిలో చేజార్చుకున్నాడు. మొత్తంగా 92 బంతుల్లో 8 ఫోర్లు 11 సిక్సులతో 133 పరుగులు చేశాడు. దీంతో బరోడా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. కానీ, విదర్భ బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంతో మరికొంత దూరంలోనే ఉన్నారు. ఓవనర్ అథర్వ టైడ్(65) అర్థశతకంతో రాణించి ఔట్ కాగా, మరో ఓపెనర్ అమన్ (117) అద్భుత శతకంతో దూసుకెళ్తున్నాడు. ఇక ధ్రువ్ షోరే కూడా అర్థ శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించడానికి కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం 38 ఓవర్లు ముగిసేసరికి విదర్భ 1 వికెట్ నష్టానికి 256 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 72 బంతుల్లో 38 పరుగులు అవసరం ఉంది.