
ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా గతకొన్ని రోజులుగా అల్లరి మూక దాడులు చేస్తే కొందరు హిందువులు మరణించారు. కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలా మూక దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ హిందూ వ్యాపారి ఖోకాన్ దాస్ శనివారం తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన భార్య సీమా దాస్ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన భర్తపై ఎందుకు దాడి చేశారో కూడా అర్థం కావడం లేదని వాపోయింది. తమకు ఏ ప్రాంతంలో ఎవరు శత్రువులు లేరని, కానీ తన భర్తపై దారుణంగా దాడి చేసి చావుకు కారణం కావడం తనకు ఆవేదన మిగిల్చిందన్నారు.
హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు రెండు రోజుల క్రితం ఖోకాన్ దాస్.పై తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్ దాస్‌కు నిప్పంటించి హత్య చేసే ప్రయత్నించారు. అయితే 50+ వయస్సు గల ఖోకాన్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్‌పూర్ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీ జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్‌లో ఉంటున్న మైనారిటీ హిందువుల భవితవ్యంపై సవాల్ విసురుతోంది.