
అమరావతి: టిడిపి నేత మైసూరారెడ్డి హల్ చల్ చేశాడు. సిఐతో టిడిపి నేత దురుసుగా ప్రవర్తించారు. అనంతపురం టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్‌ను మైసూరా రెడ్డి బెదిరించారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో ఘటన జరిగింది. ‘ఏరా.. నీ అంతు చూస్తా, నన్నే ఆపుతావా?’ అంటూ సిఐపై చిందులు వేశాడు. జడ్ పి సమావేశం సందర్భంగా అనధికార వ్యక్తులు బయటకు వెళ్లాలని సిఐ శ్రీకాంత్ యాదవ్ సూచించారు. తననే బయటకు వెళ్లమంటారా అంటూ సిఐ శ్రీకాంత్ యాదవ్ తో మైసూరారెడ్డి గొడవకు దిగాడు. టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనుచరుడుగా మైసూరారెడ్డి వ్యవహరిస్తున్నాడు. చివరలో టిడిపి నేతకే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వత్తాసు పలికాడు. పోలీసులను బెదిరించి టిడిపి నేత మైసూరారెడ్డిని జెడ్పీ సమావేశంలోకి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిఐతో దురుసుగా ప్రవర్తించిన టిడిపి నేతపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎంఎల్ఎలు, ఎంపిల కింద పని చేసే ముఖ్య అనుచరులు అధికారులతో అనుచితంగా ప్రవర్తించడం మంచిది కాదని నెటిజన్లు సూచిస్తున్నారు. పోలీసులతోనే ఇలా ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని సోషల్ మీడియా నెటిజన్లు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.