
హైదరాబాద్: టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కొలుకొని న్యూజిలాండ్ సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. గిల్‌కు ఫుడ్‌పాయిజనింగ్ కావడంతో విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింతో ఆడాల్సిన మ్యాచ్‌లో ఆడడంలేదు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో గిల్ గాయపడడంతో చివరి రెండు టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. గాయం నుంచి కోలుకొని ఇప్పుడు ఆడుదామనుకుంటే ఫుడ్‌పాయిజన్ కావడంతో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరుపున గిల్ ఏడు మ్యాచ్‌లు ఆడాడు. 418 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే జట్టును ఇవాళ బిసిసిఐ ప్రకటించే అవకాశం ఉంది. 2026లో టి20 వరల్డ్ కప్ లో టీమిండియా టీమ్ నుంచి గిల్ తీసేసిన విషయం తెలిసిందే. పంజాబ్ టీమ్ కు అభిషేక్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.