Reading Time: < 1 minute

చెన్నై: తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్‌లు కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీ హీరోగా నటిస్తుండగా.. కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ వచ్చింది. ‘తలైవర్ 173’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఓ యువ దర్శకుడికి దక్కింది. 2022లో ‘డాన్’ అనే చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న శిబి చక్రవర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ రిలీజ్‌ చేస్తూ.. రాజ్‌కమల్ ఫిల్మ్ప్ ఇంటర్నేషనల్ శనివారం ఫోటోని షేర్ చేసింది. ప్రతి హీరోకు ఫ్యామిలీ ఉంటుంది’ అని రాసుకొచ్చింది.

తొలుత ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల సుందర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే రజనీని డైరెక్ట్ చేసే అవకాశం శిబి చక్రవర్తికి లభించింది. ఇక అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.