Reading Time: < 1 minute

పాట్నా: ప్రసవం అప్పుడు కడుపులో కత్తెర్లు పెట్టి కుట్లు వేశారు. ఒక సంవత్సరం తరువాత కడుపులో నొప్పిరావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా సదరు మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం మోతిహారీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మణిభూషణ్ కుమార్ భార్య ఉషాదేవి (25) సంవత్సరం క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంగీత అనే వైద్యురాలు ఉషాదేవికి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ చేసే సమయంలో రెండు కత్తులను కడుపులో మరిచి పోయి వైద్యురాలు కుట్లు వేసింది. ఆమెకు గత కొంతకాలంగా కడుపు నొప్పి రావడంతో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంది. ఈ మధ్య కడుపు నొప్పి తారాస్థాయికి చేరుకోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిటీ స్కాన్ చేయంగా కడుపులో కత్తెర్లు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి కత్తెర్లను బయటకు తీశారు. కానీ అప్పటికే పేగుల్ని చీల్చుకొని కత్తెర్లు బయటకు వచ్చాయి. పేగులలో తీవ్ర ఇన్‌ఫెక్షన్లు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యురాలు సంగీతపై  ఉషాదేవి భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.