
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కొంటా కిస్సారం అడవుల్లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందాడు. కొంటా ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ ముగ్ధూ దుర్మరణం చెందాడు. మూడు ఎకె 47లతో పాటు భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైంది.