
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడిల ఫ్యామిలీ ఎంటర్‌టైైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనం సృష్టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ‘మీసాల పిల్ల’ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటగా, ‘శశిరేఖ’ పాట దాదాపు 40 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేశ్ నటించిన పాట ‘సంక్రాంతి అదిరిపోద్ది’ ఒక ఫెస్టివల్ సాంగ్‌లా మారింది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో చిరంజీవి తెల్లటి చొక్కా, ముదురు రంగు ప్యాంటు ధరించి, ఒక మోకాలిపై కూర్చుని, చేతిలో షాట్‌గన్ పట్టుకుని, చుట్టూ యాక్షన్‌లో ఉన్న వ్యక్తుల మధ్య కనిపించడం అదిరిపోయింది. షైన్ స్క్రీన్స్, గోల్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, కేథరీన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న థియేటర్లలోకి గ్రాండ్‌గా విడుదల కానుంది.