Reading Time: < 1 minute

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా హీరోయిన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, ట్రెడీషినల్ లుక్‌లో ఆమె ఆకట్టుకుంటుంది. ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో ఆమె భారతి అనే పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను జనవరి 5న విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, అన్నపూర్ణ స్టూడియోస్‌ఫై కింగ్ నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.