
లక్నో: లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఓ యువతి గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బండా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముర్వాలి ప్రాంతంలోని ఓ గ్రామంలో సుఖ్రాజ్ ప్రజాపతి అనే వ్యక్తి ఓ యువతిపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించింది. అతడి నుంచి తప్పించుకోవడానికి వెసులుబాటు లేకపోవడంతో పక్కనే ఉన్న గొడ్డలి తీసుకొని అతడిని నరికింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ రాజావత్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.