
తిరుమల: తిరుపతిలో భద్రతా వైఫల్యం బయటపడింది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం సృష్టించాడు. ఏకాంత సేవ ముగిసాక మద్యం మత్తులో ఆలయం గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించాడు. అనంతరం గోపురంపై ఉన్న కలశాలను లాగేందుకు మందుబాబు యత్నించాడు. పోలీసులు, టిటిడి సిబ్బంది అక్కడికి చేరుకొని మందుబాబును కిందకు దించేందుకు ప్రయత్నించారు. కిందకు దిగిన తరువాత మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మందుబాబు పైకి ఎలా వచ్చాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోజు రోజుకు తిరుపతి భద్రతా వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు సరైన భద్రతా కల్పించడంలేదని నెటిజన్లు వాపోతున్నారు. గంజాయి గ్యాంగ్, మందుబాబులు పట్ట పగలు రెచ్చిపోతున్నారు.