Reading Time: < 1 minute

జగిత్యాల: తినే టిఫిన్‌లో బ‌ల్లి కళేబరం కనిపించిన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. బుగ్గారం గ్రామానికి చెందిన ఓ మహిళ శివసాయి టిఫిన్ సెంటర్ లో దోశె తింటుండగా బలి కళేబరం కనిపించింది. వెంటనే షాక్ గురై యజమానాని ప్రశ్నించింది. అక్కడున్న కస్టమర్లు యజమానిని నిలదీశారు. ఒక్కసారిగా వాంతులు, అస్వస్థతకు గురికావడంతో వెంటనే సదరు మహిళ భయంతో ఆస్పత్రికి వెళ్లింది. ప్రస్తుతం సదరు మహిళకు చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ శివసాయి హోటల్ లో టిఫిన్‌లో బొద్దింకలు బయటపడిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా టిఫిన్‌లో బల్లి ఘటనతో పట్టణంలో మరోసారి కలకలం సృష్టించింది.