Reading Time: < 1 minute

మన తెలంగాణ / హైద రాబాద్ : మూసీ మో డ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవు తుం దో ప్రభుత్వం చెప్పా లని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం అ సెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయ న మాట్లాడుతూ ఒకసారి సీఎం లక్ష కో ట్లని, మరో సారి లక్షా 50 వేల కోట్లు అని పలుసార్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, అసలు మూసీ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలను కుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణలో ఇప్పటివ రకు ఎన్ని నివాసాలు కూల్చారు? కూల్చిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కిం ద కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ చెల్లిం చారా? లేదా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారిని అసైన్మెంట్ చేసి చే తులు దులుపుకున్నారా? అని హరీ ష్‌శ్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశా రు.

మూసీ కంపు కంటే ము ఖ్యమంత్రి మాటల కంపు ఎ క్కువగా ఉందని, ముఖ్యమం త్రి మాటల కంపు వినడం ఎ క్కువ కష్టంగా ఉందని అనగా నే స్పీకర్ హరీశ్‌రావు మైక్ కట్ చేశా రు. సభా నాయకుడిని తిడతామంటే మైక్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. హరీశ్ రావు ప్రశ్నపై మాట్లాడాలని స్పీకర్ సూచిం చారు. సిఎం అడ్డగోలుగా మాట్టాడితే ఎం దుకు ఆప లేదని స్పీకర్‌ను హరీష్‌రావు ప్రశ్పించడంతో సభలో కాసేపు గందర గోళం నెల కింది. దీంతో ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీని వాస్ హరీష్‌రావుకు సీఎంపై విమర్శలు మానుకోవాలని సూచించారు. హరీష్ చేసి న వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించా లని విప్ కోరారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వ కపోవడంతో సభనుంచి బిఆర్ ఎస్ శాసన సభ్యులు వాకౌట్ చేశారు.