
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీల క ముందడుగు వేసింది. ఈ సమస్యలకు శా శ్వత పరిష్కారం చూపేందుకు ఓ ఉన్నతస్థా యి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వు లు జారీ చేసింది. కేంద్ర జలవనరుల సం ఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ) ఛై ర్మన్లు, జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్ ఇంజినీర్ సిడబ్లూసి చీఫ్ ఇం జినీర్‌తో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శా ఖల ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
గత ఏడాది జులైలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన అ పెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని చర్చించారు. ఇటీవల డిసెంబర్‌లో తెలంగా ణ ప్రభుత్వం తమ ప్రతినిధులను నామినేట్ చేయడంతో కమిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఇరు రాష్ట్రాల మధ్య నీటిని సమానంగా పంచడం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు లు, కొత్త ప్రతిపాదనలు వంటి కీలక అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ఇదే సమయంలో, కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ -2 (కేడబ్ల్యూడీటీ- 2) గడువును కూడా కేంద్రం 2026 జులై వరకు పొడిగించింది.