
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఎక్స్‌లో అశ్లీలమైన, అభ్యంతరకరమైన కంటెంట్ పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన ప్రకటించింది. ఎక్స్‌కు సం బంధించిన ఏఐ యాప్ గ్రోక్ ద్వారా వ్యాపిస్తున్న అభ్యంతరకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించాలని లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని, ఎలోన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ఎక్స్ కు ప్రభుత్వం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో దానికి సంబంధించిన నివేదికను 72గంట ల్లో అందజేయాలని ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టె క్నాలజీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని యమాలు 2021 ప్రకారం, చట్టబద్ధమైన కంటెం ట్ అందించడంలో వైఫల్యం చెందినందుకు ఐటీ మంత్రిత్వ శాఖ ఎక్స్‌కు సంబంధించిన ఇండియా ఆపరేషన్స్ చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌కు నోటీసు జారీ చేసింది. రాజకీయంగా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటు న్న గ్రోక్‌పై ఇటీవల కొంతకాలంగా మరిన్ని ఫిర్యా దులు వెల్లువెత్తాయి. అసభ్య పదజాలం, అశ్లీతకు సంబంధించిన కంటెంట్ కోసం నెటిజన్లు ప్రాంప్ట్ ఇవ్వడం, దానికి గ్రోక్ వెంటనే కోరినట్లు సమాచా రం అందించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కొందరు యూజర్లు హీరోయిన్లు, ప్రముఖులు, నె టిజన్లకు సంబంధించిన న్యూడ్ చిత్రాలు కోరుతూ ప్రాంప్ట్ ఇస్తుండడం,అది యువతలో మరింత విపరీత ధోరిణికి అద్దం పడుతోందని ఇటీవల నివేదికలు వెల్లడించాయి. అలాగే ‘రిమూవ్ దిస్ పిక్చర్’ పేరిట కొంతమంది ఇష్టం లేని వ్యక్తులు, అక్రమార్కులను తొలగించు అనే ప్రాంప్ట్ ఇచ్చే ధోరణి కూడా పెరిగిపోయింది.
గ్రోక్ దుర్వినియోగంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: ప్రియాంక చతుర్వేది
ముంబై- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో నకిలీ ఖాతాల ద్వారా గ్రోక్ అనే ఎఐ చాట్ బాట్ దుర్వినియోగం అవుతోందని దానిని తక్షణం పరిష్కరించాలని శివసేన (యుబిటి) రాజ్యసభ డిప్యూటీ నాయకురాలు ప్రియాంక చతుర్వేతి శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది మహిళలను ఆశ్లీలంగా చూపించడానికి ఏఐ వినియోగం అవుతోందని ఆమె పేర్కొన్నారు. ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర సమాచార, టెక్నాలజీ శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ కు ఒక లేఖ రాస్తూ, పెద్ద టెక్ లతో మహిళలను లైంగికంగా చూపేందుకు, కించపరచే చర్యలకు ఏఐ దుర్వినియోగం అవుతున్న వివరిస్తూ. దీనిపై అధికారులు గట్టి చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.