Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: వాహనాలకు రో డ్ సేఫ్టీ సెస్ విధిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం శాసనసభలో మోటరు వాహనాల పన్ను సవరణ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 4 వీలర్ తేలికపాటి గూడ్స్ వాహనాలకు త్రైమాసి క టాక్స్ ఉండేదని, రవాణా శాఖ నిపుణులతో చ ర్చించి గూడ్స్‌కి సంబంధించిన వాహనాలపై లైఫ్ టాక్స్ విధిస్తూ 7.5శాతానికి చేయడం జరిగిందని తెలిపారు. ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రోడ్ సేఫ్టీపై సెస్ ఇప్పటికే ఆంధ్రప్రదే శ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అమ లు చేస్తున్నాయని, ద్విచక్ర వాహనాలకు రెండు వే లు, లైట్ మోటార్ వాహనాలకు రూ.5వేలు, హె వీ వాహనాలకు రూ.10వేలు రోడ్ సేఫ్టీ సెస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రమే విధించినట్లు తెలిపారు. ఆటో లు ,ట్రాక్టర్ ట్రైలర్లకు ఇది వర్తించదన్నారు. మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 1 నుండి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమం జరుగుతుందని, రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రుల తో అఫిడవిట్ తీసుకోవాలని, ఇందు కోసం విద్యా శాఖ ,సంక్షేమ శాఖ పాఠశాలలు పాల్గొనేలా చర్యలు తీసుకున్నామన్నారు.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు, ప్రతి పౌరునికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. యూనిసెఫ్ సహకారంతో స్కూల్ లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ రోడ్డు ప్రమాదాల రహితంగా మార్చడానికి జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయన్నారు. ఎవరికి వారు స్వీయంగా వాహనాల ఫిట్నెస్ చూసుకోవాలని, రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. వికారాబాద్ బస్సు ప్రమాదంలో ఎవరో చేసిన తప్పిదానికి అమాయకులు చనిపోయారన్నారు. సంక్షేమ శాఖ విద్యార్థులు ,ఇతర పాఠశాలలు రోడ్ సేఫ్టీ పై కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులు అందరూ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. గూడ్స్ ఆటోలకు, తేలికపాటి వాహనాలకు మాత్రమే త్రైమాసిక టాక్స్ నుండి లైఫ్ టాక్స్ కి మార్చామని, రాష్ట్రంలో వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ఈవి పాలసీ తెచ్చామని, దీంతో దాదాపు 1000 కోట్లు టాక్స్ ప్రభుత్వం నష్టపోయిందన్నారు. హైదరాబాద్‌లో ఈరోజు ఎయిర్ క్వాలిటీ 300 దాటిందంటున్నారని, ఈవి పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగి కాలుష్యాన్ని అరికడుతున్నామన్నారు. స్క్రాప్ పాలసీ తెచ్చి 15 ఏళ్లు దాటిన వాహనాలు ఈ స్క్రాప్ పాలసీ లోకి తెచ్చామన్నారు. త్వరలో ఢిల్లీ మాదిరి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ మాదిరి ఇక్కడ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. 10 ఏళ్లలో వాహన సారధి లో చేరలేదని, తమ ప్రభుత్వం రాగానే వాహన సారధి లో చేరినట్లు తెలిపారు.

మేము షేర్వాని వేసుకొస్తాం: మహేశ్వర్ రెడ్డి

మోటారు వాహనాల పన్ను చట్ట సవరణపై చర్చ సందర్భంగా బిజెపి శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతుండగా మైక్ కట్ కావిడంతో అధ్యక్షా ఇటు పక్క సభ్యులకు మైక్ కట్ చేయరు, మేము మాట్లాడితే కట్ చేస్తారు.. మేము షేర్వాని వేసుకొస్తాం అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని సిఎం అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భొంగా వాహనాలపై ట్యాక్స్‌ను పెంచి, రోడ్ సెస్ విధించి రవాణా వాహనాలతో జీవనోపాధి పొందుతున్న వారిపై భారం వేశారని ద్విచక్ర వాహనలపై సెస్ దారుణమన్నారు. పెంచిన ట్యాక్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

50శాతం గ్రేటర్ హైదరాబాద్‌కు ఇవ్వాలి: ఎంఐఎం

వాహన ట్యాక్స్‌లో 50 శాతం ట్యాక్‌ను గ్రేటర్ హైదరాబాద్‌కు ఇవ్వాలని ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ అన్నారు. ప్రతిరోజు వేల వాహనాలు రోడ్లపై నడుస్తున్నాయని దీంతో రోడ్లు పాడైపోతున్నాయని ఆయన చెప్పారు.