Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్ఎస్ పలాయన వాదం పాటిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సెషన్ ను బాయ్ కాట్ చేయడం పలాయన వాదమే అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? అని.. ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యే పరిస్థితి వచ్చిందని, అందుకే సిఎం రేవంత్ రెడ్డిపై అబాండాలు వేసి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ బండారం బయటపడుతుందనే సెషన్ ను బాయ్ కాట్ డ్రామా ఆడారని, బిఆర్ ఎస్ హయాంలో కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అసెంబ్లీకి మాజీ సిఎం కెసిఆర్ వచ్చినప్పుడు సిఎం రేవంత్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారని జూపల్లి పేర్కొన్నారు. పాలమూరు జిల్లాకు బిఆర్ఎస్ హయాంలో ఏం ఒరగబెట్టారని, అయినా మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తోలు తీస్తామని బయట అనడం కాదు.. అసెంబ్లీకి వచ్చి చర్చించండని, గతంలో మంత్రి కోమటి రెడ్డి, సంపత్ విషయంలో మీరు వ్యవహరించిన తీరును గుర్తుతెచ్చుకోండని జూపల్లి కృష్ణారావు సూచించారు.