Reading Time: < 1 minute

హైదరాబాద్: మాస్ మహరాజ్ రవితేజా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయాతి, అషిక రంగనాథ్‌లు ఇందులో హీరోయిన్లు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా సినిమా నుంచి ‘వామ్మో.. వాయ్యో’ అంటూ సాగే మాస్ పాటని విడుదల చేశారు. ఈ భీమ్స్ సిసిరోలియా సంగీతం సమకూర్చన ఈ పాటని స్వాతిరెడ్డి ఆలపించారు. ఈ పాటకు దేవ్ పవార్ సాహిత్యం అందించారు. ఈ ఊర మాస్ పాటకి ఇద్దరు హీరోయిన్లతో కలిసి రవితేజా వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాట రవితేజా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.