Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల్ శక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది. ఈ కమిటీకి కేంద్ర జల సంఘం ఛైర్మన్ నేతృత్వం వహించనున్నారు. కమిటీలో సభ్యులుగా తెలంగాణ, ఎపి నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు ఉండనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు. ఎన్‌డబ్ల్యూడిఎ చీఫ్ ఇంజినీర్, సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.