
ఆత్రేయపురం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురం మండలం పులిదిండిలో పడవ పోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ట్రయల్ రన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలసు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన అదుపు తప్పి కాలువలో పడిపోయారు. వెంటనే అక్కడున్న స్విమ్మర్లు ఆయన్ను రక్షించి వేరే పడవలోకి ఎక్కించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.