
యాషెస్ సిరీస్‌లో ఇటీవల జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. సుమారు 15 సంవత్సరాల తర్వాత తొలిసారిగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆషీస్ బ్యాటర్లకు కీలక సూచనలు చేశాడు. వారు బ్యాటింగ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు అజింక్యా రహాన, ఛతేశ్వర్ పుజారాలను ఆదర్శంగా తీసుకోవాలని.. ఆసీస్ బ్యాటర్లు ఓర్పుగా, నేర్పుగా బ్యాటింగ్ చేయాని అన్నారు.
‘‘మెల్‌బోర్న్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించింది. అయితే ప్రస్తుతం క్రికెట్ ఆడే విధానం వల్లే ఇలా జరిగిందని నేను భావిస్తున్నాను. బ్యాటర్లకు సరైన నేర్పు, ఓర్పు, పోరాటతత్వం ఉంటే ఈ పిచ్ మీద కూడా రాణించవచ్చు. ఇది హై స్కోరర్ పిచ్ కాదని నాకు తెలుసు. కానీ, దీని మీద 300 స్కోర్ చేయలేం., కానీ, ప్రయత్నిస్తే.. 250 పరుగులు చేయడం సాధ్యమే. పుజారా, రహానేలా ఆడాలి. అప్పుడు కచ్చితంగా పరుగులు వస్తాయి’’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో ఉతప్ప అన్నాడు.