Reading Time: < 1 minute

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి వైఖరికి నిరసనగా సమావేశాల బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వచ్చామని అన్నారు. ఈ సందర్భంగా గన్ పార్కు వద్ద హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారని, బిఎసిలో నిర్ణయాలు ఒకటైతే.. సభలో పెట్టింది మరొకటి అని తెలియజేశారు. ముఖ్యమంత్రి సభను బూతుల మయం చేశారని, సిఎం వ్యాఖ్యలపై నిరసనకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోతే సభకు ఎందుకు రావాలి? అని.. ముఖ్యమంత్రిని విమర్శించవద్దని స్పీకర్ ఎలా అంటారు? అని ప్రశ్నించారు. మూసీ కంటే ముందు సిఎం నోరు ప్రక్షాళన చేయాలని, అసెంబ్లీని సిఎం గాంధీభవన్, సిఎల్పి భేటీలా మారుస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రశ్నిస్తే సిఎం అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.

సిఎం మాట్లాడిన అనంతరం మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని బిఆర్ఎస్ వాకౌట్ చేశారు. బిఆర్ఎస్ నిరసన గన్ పార్కు వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు. సభాపతి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ సభ్యులు నినాదాలు, అసెంబ్లీ నుంచి గన్ పార్క్ వద్దకు వెళ్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేశారు. బిల్లులపై చర్చకు దూరంగా ఉండాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకున్నారు.