
దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జననాయగన్’. రాజకీయాల్లో పూర్తిగా దృష్టి కేంద్రీకరించడానికి విజయ్ ఈ సినిమాతో తన నటన కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. జనవరి 9న ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్‌కి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. వీటి ద్వారా ఇప్పటివరకూ రూ.15 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
మరోవైపు తెలుగులో విజయవంతమైన ‘భగవంత్ కేసరి’ సినిమా రీమేక్‌గా ఇది తెరకెక్కినట్లు టాక్ ఉంది. దీనిపై దర్శకుడు హెచ్.వినోద్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ విషయన్ని ధృవీకరించను.. అలాగే ఖండంచను. ఇంతకు ముందు కూడా మీకు ఈ విషయం చెప్పాను. ఇది దళపతి మూవీ. ఇది రీమేకా..! ఏదైనా చిత్రం నుంచి స్పూర్తి పొంది తీశారా? అన్న విషయంలో ఆందోళన అవసరం లేదు. వచ్చి సినిమా చూడండి అని అన్నారు. ఇక జనవరి 3వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ట్రైలర్ విడుదలైతే.. సినిమాకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందించారు.