
హైదరాబాద్: భద్రాద్రి జిల్లాలో అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కెఎల్‌ఆర్ కాలేజీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 60 మంది విద్యార్థులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రాణనష్టం జరగలేదని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.