Reading Time: < 1 minute

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ వదిలిన బాణం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అని మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి తెలిపారు. కవిత కన్ఫ్యూజన్ లో ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందని అన్నారు. కవిత వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలని, తన తండ్రి మీద సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందింన కవిత.. మాజీ మంత్రి హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు.