Reading Time: < 1 minute

లక్నో: పెళ్లి చేసుకుంటానని నమ్మించి నర్సుపై పలుమార్లు అత్యాచారం చేసి మోసం చేసిన వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కైశర్ భాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెతో వైద్యుడు ప్రేమాయణం నడిపించాడు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారం కూడా చేశాడు. పెళ్లి చేసుకోవాలని వైద్యుడిని ఆమె బలవంతం చేయడంతో వీడియోలు, ఫొటోలు ఉన్నాయని సోషల్ మీడియాలో షేర్ చేశానని నర్సును బెదిరించాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.