
హైదరాబాద్: దుర్గం చెరువు ఆక్రమించడంపై బిఆర్ఎస్ ఎంఎల్ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధామైన విషయమని, తన మీద వస్తున్న వార్తలను కొట్టిపడేశాడు. దుర్గం చెరువులో తాము ఐదు ఎకరాల భూమి కబ్జా చేశానని కేసు పెట్టారని, అందులో మాకు గజం జాగా కూడా లేదని, ప్రభుత్వానికి కూడా గజం జాగా లేదన్నారు. అక్కడ అందరూ వాహనాల పార్కింగ్ పెట్టుకుంటారని, అక్కడే ఖాళీ స్థలంలో చెత్త డంప్ చేస్తారని తెలిపారు. కావాలని తనపై కేసు పెట్టారని, వాళ్ల దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని కొత్త ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.
తనపై కక్షతో కేసు పెట్టారని, బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయని వివరించారు. దుర్గం చెరువులో తనకు భూమి లేదని, ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారని, ఏదో హైడ్రా వాళ్లకు ఫిర్యాదు చేశారని తనకు సిబ్బంది ఫోన్ చేసి చెప్పారని, తాను పక్కగా పోలీస్ స్టేషన్ కు వెళ్తానని, లీగల్ గా ఫైట్ చేస్తానని కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ వెహికిల్ పార్కింగ్ చేయడమనేది సహజమని, బేషరతుగా కేసు విత్‌డ్రా చేసుకోకపోతే ఎఫ్ టిఎల్ పరిధిలో ఇండ్లు కట్టారని, ఆ ఇండ్ల ముందు ధర్నా చేస్తానని చెప్పారు.