
హైదరాబాద్: శాసనసభ ప్రారంభం కాగానే ప్రతి పక్ష సభ్యుల నిరసన చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ చేశారు. సభలో బిల్లులు ప్రవేశ పెట్టాలని సభాపతి ప్రసాద్ తెలిపారు. సభ ముందుకు పురపాలక, జిహెచ్ఎంసి చట్ట సవరణ బిల్లులు, సభ ముందుకు ప్రైవేటు వర్సిటీలు, మోటారు వాహనాలు చట్ట సవరణ బిల్లులు అమోదం. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా మంత్రి శ్రీధర్ బాబు ఉన్నామన్నారు. ఈ సందర్భంగా శాసనసభలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఆర్ డిసిఎల్ చేపడుతుందని, ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, రూ. 4,100 కోట్లతో ఎడిబి రుణంతో ప్రాజెక్టును ఎంఆర్ డిసిఎల్ చేపడుతుందని అన్నారు. ప్రణాళిక, విశ్లేషణ, డిజైన్ పై 18 నెలల్లో డిపిఆర్ సమర్పిస్తుందని, బ్లూ గ్రీన్, ల్యాండ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోందని తెలియజేశారు. మన జాతి పిత మహాత్మ గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదన ఉందని, రక్షణశాఖ భూముల కోసం రక్షణశాఖ అధికారులకు ప్రతిపాదన చేస్తున్నామని చెప్పారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఐదు జోన్లుగా విభజన జరిగిందని, మొదటి దశలో 55 కి.మీ మేర అభివృద్ధి ప్రాజెక్టు జరుగుతుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.