Reading Time: < 1 minute

మాదాపూర్: హైదరాబాద్ మహా నగరంలో దుర్గం చెరువు ఆక్రమించారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు పరిధిలోని ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్లను కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్‌రెడ్డి ఆక్రమించి పార్కింగ్‌కు వాడుతున్నారు. హైడ్రా అధికారులు గుర్తించి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో దుర్గం చెరువు ఎఫ్ టిఎల్ పరిదిలో ఉన్న అమర్ కోఆపరేటివ్ సొసైటీ, డాక్టర్స్ కాలనీ, నెక్టార్ కాలనీ, కావురిహిల్స్ లలో నివాసం ఉంటున్న వారికి హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.