
హైదరాబాద్: మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు చేస్తున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ప్రశ్నించారు. శుక్రవారం శాసన సభలో మూసీ నది సుందరీకరణపై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రూ. లక్ష కోట్లా? రూ. లక్షన్నర కోట్లా? ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మూసీ సుందరీకరణ కింద ఎన్ని నివాసులు కూల్చివేశారో చెప్పాలని నిలదీశారు. కూల్చివేసిన ఇళ్లకు పరిహారం ఇచ్చారా? లేదా అని తెలియాలని, 2013 భూసేకరణ చట్ట ప్రకారం రూ.14.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, నిర్వాసితులకు కెసిఆర్ కట్టిన రెండు పడకల ఇళ్లు ఇచ్చారా? అని హరీష్ రావు అడిగారు.