
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసిల కొద్దీ అబద్దాలు, క్యూ సెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని మాజీ మం త్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఘాటు విమర్శలు చేశారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అ నుముల రేవంత్ రెడ్డి అని, నటనకు ఇచ్చినట్లు అ బద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బ హిరంగ సత్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు గు రువారం హరీష్‌రావు ఒక ప్రకటన విడుదల చేశా రు. బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు తేడా సిఎంకు తెలియదని ఇప్పుడు కొత్తగా తెలిసిందని విమర్శించారు. కీర్తిశేషులైన బచావత్ ఏ లోకంలో ఉన్నారో కానీ, ముఖ్యమంత్రి ప్రదర్శిస్తు న్న అజ్ఞానాన్ని చూసి ఎంత మదన పడుతున్నారో అని పేర్కొన్నారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం రేవంత్ నైజం అంటూ మండిపడ్డారు. సభకు వస్తే కెసిఆర్‌ను అవమానించం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్‌మీట్‌లో కెసిఆర్‌ను కసబ్ తో పోల్చుతావా..? అని నిలదీశారు. తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి, నాలుగు కోట్ల ప్రజలను ఒక్కటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేసి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్‌తో పోల్చిన రేవంత్‌రెడ్డికి సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదని అన్నారు.
ఆయనకు తెలిసింద ళ్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూ తు ప్రసంగం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కె సిఆర్‌ను, తనను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాల ని అంటూ అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవై పు మర్యాద పాటిస్తానని సుద్దపూసలా నటిస్తా వా..? అని ప్రశ్నించారు. ఆవు తోలు కప్పుకున్న తోడేలు రేవంత్‌రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్లు, ఆయ న డొంక తిరుగుడు మాటలు మాట్లాడారు తప్ప, పోలవరం నల్లమల సాగర్ విషయంలో తాను వేసి న ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పలేదని హరీష్‌రావు సిఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. రేవంత్‌రెడ్డి గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టు లో పోరాడేదే నిజం అయితే, ఢిల్లీ మీటింగ్ ఎందు కు పోయారని అడిగారు. కమిటీ ఎందుకు వేశా రు, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినవు..? అం టూ ప్రశ్నల వర్షం కురిపించారు. కమిటీ వేయ డం అంటేనే ఎపి జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థం అవుతుందని ఘాటు విమర్శలు చేశారు.
కృష్ణాలో 763 టిఎంసిలు సిఎం అడుగుతుంటే కెసిఆర్ 299 టిఎంసిలకు ఒప్పుకున్నారని సిఎం అబద్దాలాడారని విమర్శించారు. కెసిఆర్ 299కి ఒప్పుకున్నది నిజం అయితే, మొత్తం 811 టిఎంసిలు పున:పంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాసారని ప్రశ్నించారు. సిఎం కొత్తగా 71 శాతం వాటా తెలంగాణకు రావాలని మాట్లాడారని, ఆనాడే కెసిఆర్ 811 టిఎంసిల్లో 69 శాతం తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం ఆయనకు తెలియదా..? అని నిలదీశారు. కేంద్రం స్పందించకపోతే సుప్రీంకు ఎందుకు వెళ్తారు… బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని ఎందుకు 28 లేఖలు రాస్తారు..రెండు అపెక్స్ మీటింగ్స్‌లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తారని ప్రశ్నల వర్షం కురించారు. అపెక్స్‌లో మీటింగ్ మినట్స్ పంపిస్తున్నా కళ్లు పెద్దవి చేసి రేవంత్‌రెడ్డి చదువుకోవాలని సూచించారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పున: పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామి మేరకు కేసు ఉపసంహరించుకున్న సంగతి సిఎం తెల్వదా..ఎందుకు ఈ నిజాన్ని దాచి పెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణను సాధించి, ప్రజలకు ఎంత మేలు చేసారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పున: పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహనీయుడు కెసిఆర్ అని పేర్కొన్నారు.
ఆయనను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని వ్యాఖ్యానించారు. అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయి, కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏందని అతి తెలివితో అజ్ఞానంతో సిఎం మాట్లాడారని విమర్శించారు. తుంగభద్ర అనే నది ఉందని సిఎం తెలుసా.. ఆ నది ద్వారా 450- నుంచి 600 టిఎంసిలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకు వస్తాయనే కనీస జ్ఞానం నీకు లేకపాయె అని విమర్శించారు. ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.50లక్షల ఎకరాల ఆయకట్టుకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించిందని అడిగారు. అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.80లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నది రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కదా..? అని ప్రశ్నించారు. జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్..ఇంక దాని మీద పాలమూరు రంగారెడ్డి భారం కూడా పెడితే ఎవరికి నీళ్లు రాక అందరూ ఆగం అయిపోరా..? అని అడిగారు. పాలమూరు రంగారెడ్డి మీద ఎన్‌జిటిలో కేసులు వేసిన ప్రబుద్దుడిని పురమాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా..? అని నిలదీశారు. అయినా పాలమూరుకు 90 టిఎంసిలకు డిపిఆర్ పంపి 7 అనుమతులు తెచ్చింది కెసిఆర్ అని…కానీ, కాంగ్రెస్ వచ్చిన రెండేళ్ల ఒక నెలలో ఒక్క అనుమతి తెచ్చింది లేదు అని, డిపిఆర్ వెనక్కి వచ్చేలా చేశారని అన్నారు. ఇదీ రేవంత్‌రెడ్డి సమర్థత, గొప్పతనం అని విమర్శించారు.