Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు శాసనసభ లో ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరగనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన అ జెండాలో పేర్కొన్నారు. అలాగే శాసనపభలో పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వీటిలో పురపాలక, జిహెచ్‌ఎంసి చట్ట సవరణలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, మోటారు వాహనాల పన్ను చట్ట సవరణలపై చర్చ జరగనున్నట్లు పేర్కొన్నారు. సభ నిర్వహణపై బిజినెస్ అడ్వైజర్ కమిటి (బిఎసి)లో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. ఇలా ఉండగా కృష్ణాజలాలపై సభలో శనివారం చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.