
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాప సందేశం తెలియజేశారు. ఈమేరకు ఆయన ఢిల్లీ లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి గురువారం వెళ్లి అక్కడి సంతాప సందేశాల పుస్తకంలో సంతకం చేశారు. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలకు సంతాపం తెలియజేశారు.