
మహాన్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సిద్ధు గాడి లవ్ స్టోరీ‘. ఈ సినిమాను బాలబ్రహ్మచారి సమర్పణలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై సావిత్రమ్మ.సి. నిర్మిస్తున్నారు. రమేష్.సి. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది. ‘సిద్ధు గాడి లవ్ స్టోరీ‘ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ సిద్ధు గాడి లవ్ స్టోరీ‘ని ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో మహాన్, హీరోయిన్లు మోహన సిద్ధి, శృతి, మ్యూజిక్ డైరెక్టర్ అధిరవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.