Reading Time: < 1 minute

AP News : ఏపీలో మూడు కొత్త జిల్లాలు.. మొత్తంగా 28

Caption of Image.

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 25 నుంచి 28కి చేరుకోనుంది. సోమవారం (డిసెంబర్ 29) ఏర్పాటు చేసిన కేబెనెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. 

కేబినెట్ లో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు.  రాజంపేటను కడప జిల్లాలో కలుపుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రైల్వేకోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది కేబినెట్. 

కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 28కి పెరిగనుంది.  డిసెంబర్ 31 న తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం. 

©️ VIL Media Pvt Ltd.