
ఆస్ట్రేలియాలోని క్విన్‌లాండ్స్‌లో 16 మంది స్కైడైవర్‌లు పారాచూట్‌తో స్టంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. 15,000 అడుగుల ఎత్తుకు విమానంలో చేరుకున్న తర్వాత, వారు ఒక్కొక్కరుగా కిందకు దూకారు. ఈ స్కైడైవింగ్ స్టంట్‌లో మరికొద్ది క్షణాల్లో వారంతా చేతులు పట్టుకుని విన్యాసం చేయాల్సి ఉంది. అయితే, ఈ సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. విమానం నుంచి జంప్ చేస్తుండగా, ఓ స్కైడైవర్ పారాచూట్ విమానం తోక భాగాన్ని చుట్టుకుంది. దాంతో, ఆ స్కైడైవర్ విమానం తోక భాగంలో వేలాడుతూ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.