Reading Time: < 1 minute

Vrusshabha: నాన్నగా నువ్వే నా గెలుపు.. ఎమోషనల్‌ అయ్యేలా మరో ఫాదర్ సాంగ్

Caption of Image.

మలయాళ స్టార్ మోహన్ లాల్ లీడ్‌‌గా నంద కిషోర్ రూపొందించిన చిత్రం ‘వృషభ’. సమర్జిత్ లంకేష్‌‌, రాగిణి ద్వివేది, నయన్ సారిక, నేహా సక్సేనా, రామచంద్రరాజు కీలకపాత్రలు పోషించారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ  టెలిఫిలిమ్స్‌‌తో క‌‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించింది. డిసెంబర్ 25న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా శుక్రవారం (DEC 13) ఈ మూవీ నుంచి ‘అప్పా’ అంటూ సాగే  ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘పది నెలలు  నిను మోయలేదు కానీ.. బ్రతుకంతా నిన్ను భుజాలపై  మోయగలను.. నువ్వే నా ఊపిరి.. నువ్వే నా లోకము.. నువ్వే నేనంటూ బ్రతికే ఓ పిచ్చి తండ్రినేరా.. నాన్నగా  నువ్వే నా గెలుపు..’ అంటూ తండ్రీకొడుకుల మధ్య సాగిన పాట ఎమోషనల్‌‌గా సాగింది.

శ్యామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని లిరిక్స్ రాయగా, విజయ్ ప్రకాష్ పాడిన తీరు ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని బంధాలు, త్యాగాలు ఆడియెన్స్‌‌కు గొప్పగా క‌‌నెక్ట్ అవుతాయని దర్శకుడు నంద కిషోర్ అన్నాడు. లార్జర్‌‌‌‌ దేన్ లైఫ్ డ్రామాతో గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత ఏక్తా క‌‌పూర్ అన్నారు.

©️ VIL Media Pvt Ltd.