Reading Time: < 1 minute

కేంద్ర పాలిత ప్రాంతాల్లో తక్కువకు కొని.. గ్రామాల్లో అమ్మకం.. జగిత్యాల జిల్లాలో భారీగా మద్యం సీజ్

Caption of Image.

జగిత్యాల జిల్లాలో మద్యం స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు ఎక్సైజ్ అధికారులు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి మద్యం స్మగ్లింగ్ చేస్తూ గ్రామాల్లో అమ్ముతున్న ముఠాను 2026 ఆగస్టు 14న పట్టుకున్నారు.  నిందితులను నుంచి భారీగా మద్యం సీజ్ చేశారు.

కథలాపూర్ మండలం గంభీర్‌పూర్, బొమ్మెన గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఏకకాలంలో మెట్‌పల్లి ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు చేశారు. సుమారు లక్ష 50 వేల రూపాయల  విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యాన్ని మెట్‌పల్లి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.

స్వాధీనం చేసుకున్న మద్యం తెలంగాణకు చెందినది కాదని అధికారుల గుర్తించారు. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా & నగర్ హవేలీ, దమన్ & డయూ నుంచి అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో మద్యం తక్కువ ధరకు దొరుకుతుండటంతో.. అక్కణ్నుంచి తెచ్చి గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

నిందితులను జవ్వాజి శ్రీనివాస్, పంజాల గంగాధర్‌గా గుర్తించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  గంగాధర్ ను  రిమాండ్ కు తరలించారు. జవ్వాజి శ్రీనివాస్  పరారీలో ఉన్నాడు. 

©️ VIL Media Pvt Ltd.