
Abhishek Porel: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్టార్ బ్యాటర్, బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ తీవ్ర వివాదంలో చిక్కుల్లో చిక్కుకున్నాడు. బెదిరింపులు, లైంగిక దాడి ఆరోపణలతో హుగ్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా స్థానిక కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం, విచారణ సజావుగా కొనసాగేందుకు అభిషేక్ పోరెల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్య విద్యార్థిని హాట్ కామెంట్స్:
బాధితురాలైన కర్ణాటకకు చెందిన ఒక మెడికల్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిపై కేసులు నమోదు చేశారు. 2023 నుంచి తమ మధ్య ప్రేమ బంధం ఉందని, పెళ్లి చేసుకోవాలని కూడా భావించామని సదరు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే గత ఏడాదిన్నర కాలంగా తమ మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని పోరెల్ బెదిరింపులకు దిగాడని ఆరోపించింది. దీంతో పోలీసులు భారతీయ నస్యాయ సంహిత (BNS) సెక్షన్లతో పాటు ఐటీ చట్టం 66E, 72 నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం అతడి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఐపీఎల్ 2026 టైంలో దాడి:
ఐపీఎల్ 2026 సీజన్ జరుగుతున్న సమయంలో, ఏప్రిల్ 2వ తేదీన వీరిద్దరి మధ్య జరిగిన ఒక సమావేశంలో అభిషేక్ పోరెల్ తనపై భౌతిక దాడికి దిగాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తనను ఒక గదిలో బంధించి, కనీసం తినడానికి ఆహారం కూడా ఇవ్వకుండా ఘోరంగా వేధించాడని ఫిర్యాదులో వెల్లడించింది. ఆ వేధింపులతో తను తీవ్ర అనారోగ్యానికి గురై వైద్య చికిత్స కూడా పొందాల్సి వచ్చిందని తెలిపింది. అయితే ఈ ఆరోపణలన్నీ ప్రస్తుతం విచారాణ దశలోనే ఉన్నాయని, ఆధారాలన్నింటినీ కోర్టులో నిరూపించబడాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
#WATCH | Hooghly, West Bengal: Hooghly Rural SP Kunwar Bhushan Singh- In connection with Mogra PS Case No. 346/26, registered under Sections of BNS and Sections 66E/72 of the IT Act, the prime accused, namely Abhishek Porel (Cricketer) has been arrested from Emami City under Dum… pic.twitter.com/RR4K9vuI7G
— ANI (@ANI) August 11, 2026