
ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థలు ఏజ్ లిమిట్ ను రెండు సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2026 ఆగస్టు 14న ఈ మేరకు జీవో విడుదల చేసింది.
యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని రెండేల్లకు పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. యూనిఫాం ఉద్యోగాలైన పోలీస్, అగ్నిమాపక (ఫైర్), జైళ్లు, SPF,ఎక్సైజ్,రవాణా, అటవీ శాఖ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచింది.
గరిష్ట వయోపరిమితి పెంచడంతో లక్షలాదిమంది నిరుద్యోగులకు లాభం చేకూరనుంది. జీవో నెంబర్ 122 ద్వారా గరిష్ట వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
యూనిఫాం జాబ్స్ కు ఏజ్ పెంచాలని గత కొంత కాలంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఏ కేటగిరీ వాళ్లకు ఎంత పెరుగుతుంది..?
పెంచిన ఏజ్ లిమిట్ తో ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులకు కానిస్టేబుల్ గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలకు పెరుగుతుంది. కానిస్టేబుల్ జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 29 సంవత్సరాలకు చేరుకుంటుంది.
ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల ఎస్సై గరిష్ట వయో పరిమితి 37 సంవత్సరాలకు చేరుకుంటుంది. అదే విధంగా జనరల్ ఎస్సై అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలకు పెరుగుతుంది.